కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీకి దిగడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ క్రమంలో సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘‘సోనియా గాంధీ రాయ్‌బరేలీని వదిలి వెళ్లిపోయారు. కొవిడ్ తర్వాత ఆమె తన నియోజకవర్గాన్ని ఒక్కసారి కూడా సందర్శించలేదు. ఇక్కడ పోటీలో దింపడానికి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ అభివృద్ధి కోసం పని చేసిన ఒక్క కార్యకర్త కూడా మీకు కనిపించలేదా?’’ అని విమర్శించారు.