ప్రధాని మోదీది ఫ్లాప్ సినిమా: టీఎంసీ ఎంపీ

64చూసినవారు
ప్రధాని మోదీది ఫ్లాప్ సినిమా: టీఎంసీ ఎంపీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేస్తున్న తన పదేళ్ల పాలన ట్రైలర్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సెటైర్లు వేశారు. ప్రధాని తన 10 ఏళ్ల పాలనను ట్రైలర్ మాత్రమే అంటున్నారు కానీ మొత్తంగా ఆయన సినిమా ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చని అతిపెద్ద అబద్దాలకోరు అని తీవ్రంగా విమర్శించారు. ట్రైలర్‌లోనే ఫెయిల్ అయ్యారు, ఆయన సినిమా ఇక ఆడదు, మోదీ తిరిగి గుజరాత్‌కు వెళ్లిపోవాల్సిందేనని అన్నారు.

సంబంధిత పోస్ట్