పంజాబ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన అదనపు భద్రతను ఉపసంహరించుకోనున్నట్లు పంజాబ్ పోలీసులు గురువారం స్పష్టం చేశారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో కేజ్రీవాల్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. కేజ్రీవాల్‌కు పంజాబ్ పోలీసులు అదనపు భద్రత కల్పించడంపై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు చేశారు.