దానిమ్మ గింజలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండులో విటమిన్ సి, కె, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గింజలు చిగుళ్ళను బలపరిచి, పళ్ళను గట్టిపరుస్తాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.