సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా నరసరావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని జైలుకు తరలించేందుకు పోలీసులు వచ్చారు. కానీ అదే సమయంలో అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు కూడా పోసాని కోసం పీటీ వారెంట్లతో వచ్చారు. దీంతో పీటీ వారెంట్‌పై పోసానిని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో పోసానికి ఈనెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది.