29 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం

60చూసినవారు
29 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహాలకు శవపరీక్ష జరుగుతోందని బస్తర్‌ రేజంజ్ ఐజీ సుందరరాజన్‌ తెలిపారు. ఎన్‌కౌంటర్ మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులు, 14 మంది పురుష నక్సల్స్ ఉన్నారని పేర్కొన్నారు. డీఆర్జీ, బీఎస్‌ఎఫ్ జవాన్లు సంయుక్తంగా నక్సల్స్‌ను చుట్టు ముట్టి మంచి ఫలితాలు సాధించారన్నారు.

సంబంధిత పోస్ట్