యూపీలోని రాయ్‌బరేలీలో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఓ కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. అయితే ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కారు డ్రైవర్ కావాలనే ఈ దారుణానికి పాల్పడ్డాడ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు కాగా చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.