జానపద మతంగా బాథౌయిజం

84చూసినవారు
జానపద మతంగా బాథౌయిజం
అస్సాంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ ప్రభుత్వం బాథౌయిజంను జానపద మతంగా గుర్తించింది. బోడో తెగ ప్రజలు బాథౌబ్రాయ్ లేదా సిబ్రాయ్‌ను దేవుడిగా ఆరాధిస్తారు. బోడో భాషలో బా అంటే ఐదు, థౌ అంటే తాత్విక చింతన అని అర్థం. ఈ మతంలో ఐదు ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి బార్(గాలి), శాన్(సూర్యుడు), హా(భూమి), ఓర్(అగ్ని), ఓఖ్రాంగ్(ఆకాశం). బోడో ప్రజలను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో మైదాన తెగగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్