వర్షాకాలంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

69చూసినవారు
వర్షాకాలంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
👉విద్యుత్‌ స్తంభం నుంచి వ్యవసాయ మోటరుకు మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ దూరం ఉంటే గాలులు వీచినప్పుడు వాటి మధ్య ఉండే సర్వీస్‌ వైరు వదులై మోటరుపై ప్రభావం చూపుతుంది.
👉విద్యుత్‌ స్తంభం నుంచి మోటరుకు కరెంటు నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్‌ బ్యాక్‌, స్టార్టర్‌ తప్పనిసరి ఉండేలా చర్యలు తీసుకోవాలి.
👉విద్యుత్‌ మోటరు వద్ద ఫ్యూజులు, ఇండికేటర్‌ బల్బులు, స్టార్టర్‌ను ఒక చెక్కపై బిగించుకోవాలి.
👉బావుల వద్ద తడిసిన చేతితో స్టార్టరును తాకవద్దు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్