*వాహనం టైర్ల గ్రిప్/థ్రెడ్ బాగోలేకపోతే వెంటనే టైర్లను మార్చుకోవాలి.
*టైర్లలో గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
*వర్షంలో ప్రయాణిస్తున్నపుడు పరిమిత వేగంతో వెళ్లడం మంచిది.
*ఇంజిన్ కండిషన్, బ్రేక్స్ పాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయించుకోవడం మేలు.
*వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
*అత్యవసర సమయాల్లో #Dial100 కి కాల్ చేసేలా మొబైల్/ వాహనంలో స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోవాలి.