నోరో వైరస్ సోకిన వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేయాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నోరో వైరస్ సోకిన వ్యక్తులు ఇతరులకు దూరంగా ఉండాలి. వారు వాడిన వస్తువులు కుటుంబ సభ్యులు వాడకూడదు. ఈ వైరస్ నుంచి వాళ్లు పూర్తిగా కోలుకునేంతవరకు ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.