మినీ మూన్స్ కావొచ్చు, భూమిని చుట్టే 2024 పీటీ5 వంటి గ్రహ శకలాలు కావొచ్చు. ఖగోళ పరంగా ఆసక్తిని కలిగించే వీటిల్లో విలువైన లోహాలు దండిగా ఉంటాయి. ఏదో ఒకరోజున కంపెనీలు వీటి మీద తవ్వకాలు జరిపినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. అత్యాధునిక వ్యోమనౌకను ప్రయోగించి, దాన్ని గ్రహ శకలానికి అనుసంధానం చేస్తే సరి. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలను సుసాధ్యం చేయటానికి 2024 పీటీ5 మీద చేసే అధ్యయనాలు తోడ్పడనున్నాయి.