తనకు ధోనీ కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీనే నచ్చుతుందని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. 'రోహిత్ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిస్తాడు. వారి దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు. వారికేం కావాలో అడుగుతాడు. అందుకే ప్లేయర్లు అతడితో సన్నిహితంగా ఉంటారు. ధోనీ అలా కాదు. ఆయన స్టైల్ వేరు. ఎవరితోనూ మాట్లాడడు. ప్లేయర్ దగ్గరకు వెళ్లి నీకు ఎలాంటి ఫీల్డ్ కావాలని అడగడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని భావిస్తాడు' అని భజ్జీ తెలిపారు.