ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

56చూసినవారు
ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
మహాకుంభమేళా విజయవంతంగా పూర్తి కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రధాని మాట్లాడుతూ మహా కుంభమేళాపై స్పందించారు. భారత్‌ శక్తి ఏంటో మహాకుంభామేళా రూపంలో ప్రపంచం మొత్తం చూసిందని తెలిపారు. 45 రోజుల పాటు సాగిన మహాకుంభామేళాలో 65 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించడం గొప్ప విషయమన్నారు. అలాగే ఈ ఆధ్యాత్మిక కార్య‌క్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్