జీవ వైవిధ్యానికి ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పులులను కాపాడుకొనేందుకు అవి సంచరించే అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 2010 నుంచి ఏటా జూలై 29న వరల్డ్ టైగర్స్ డే నిర్వహిస్తున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో జరిగిన టైగర్ సమ్మిట్ నిర్ణయం మేరకు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుతున్నారు.