ఎండ తీవ్రతకు దగ్ధమైన పల్సర్ బైక్ (వీడియో)

64చూసినవారు
TG: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం కూకట్ పల్లి– జగద్గిరి గుట్టలో ఎండ తీవ్రతకు ఓ యువకుడి పల్సర్ బైక్ కాలిబూడిదైంది. డ్రైవ్ చేస్తుండగా.. ఒక్కసారిగా వేడి ఎక్కువ కావడంతో అప్రమత్తమైన యువకుడు రోడ్డుపై ఆపాడు. ఇంజిన్ నుంచి మంటలు వచ్చి బైక్ మొత్తం అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్