తన వివాహానికి పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన పీవీ సింధు

67చూసినవారు
తన వివాహానికి పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన పీవీ సింధు
ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా ఆమె వివాహం జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలసి తన వివాహానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. ఈ మేరకు మంగళగిరిలోని పవన్ కార్యాలయానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు.

సంబంధిత పోస్ట్