టీమిండియా హెడ్ కోచ్‌గా వీడ్కోలు పలికిన రాహుల్ ద్రవిడ్.. ఆర్‌సీబీ(RCB) హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడని ఆ జట్టు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్‌తో ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ కూడా తన సొంత రాష్ట్రానికి చెందిన ఆర్‌సీబీకి కోచ్‌గా లేదా మెంటార్‌గా పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.