కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ వైట్ టీ షర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు సాయం చేయడం లేదని, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడడానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సామాజిక సమానత్వం కోసం పోరాడాలని చెప్పారు.