కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈనెల 27 తేదీన తెలంగాణకు రాబోతున్నట్లు శనివారం కాంగ్రెస్ హైకమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న 'సంవిధాన్' బచావో రాష్ట్రీయ పాదయాత్ర' కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.