ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ కేటాయింపు

57చూసినవారు
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ కేటాయింపు
పార్లమెంటు ఎన్నికలకు ముందుగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి శాసనమండలి చీఫ్‌ విప్‌గా బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి మహేందర్‌రెడ్డి విప్‌గా బాధ్యతలు చేపట్టలేదు. అయితే బుధవారం పితృపక్షం అమావాస్య ముగియనుండడంతో ఈనెల 4న విప్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్