రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల పరిధిలోగల ఆలూరు గేటు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై స్థానిక ఆర్డిఓ చంద్రకళ స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల వైఫల్యాల వాళ్ళనే ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అన్నారు. రోడ్డు నిర్మాణానికి కాను నిధులు విడుదల అయినప్పటికీ కూడా పనులు మొదలు కాకపోవడమే కారణమన్నారు.