మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దు

75చూసినవారు
మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దు
మా గ్రామాన్ని చేవెళ్ల మున్సిపాలిటీలో కలపొద్దు" అంటూ గ్రామస్తులు గ్రామసభలో తీర్మానం చేశారు. దేవుని ఎర్ర వల్లి గ్రామంలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా జరిగిన సభలో ప్రత్యేకాధికారి వెంకటయ్య అధ్యక్షతన ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలో కలిస్తే పేద ప్రజలు ఉపాధిహామీ పనులు కోల్పోతారని, అభివృద్ధిలో వెనకబడతారని చెప్పారు. తమ గ్రామం గ్రామ పంచాయతీగా కొనసాగాలని కోరారు. అధికారులు గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్