ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల స్థానిక పోలీసులు స్థానిక మాల మహానాడు నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ఈ అరెస్టులో మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కంపేట ఆంజనేయులు, స్థానిక మాల మహానాడు నేతలు ఉన్నారు.