పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ 5వ వార్డులో తార హోమ్స్ నుంచి డాక్టర్ హుస్సేన్ ఇంటి వరకు జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం స్థానిక కౌన్సిలర్ బొర్ర అనురాధ సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశామన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.