ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మెట్మ ఉద్యోగస్తులను శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఏడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుకోవడం జరుగుతుందని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధికారులను కలిసేందుకు వెళ్తున్న మమ్మలిని హౌజ్ అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ 10000 వేతనము ఇవ్వాలని కోరారు.