పెద్ద అంబర్ పేట్ వద్ద ప్రవైట్ ట్రావెల్స్ బస్సుల పై శుక్రవారం ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ కు వస్తున్న ప్రవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ సరిగ్గా లేకపోవడం, మోతాదుకు మించి ప్యాసింజర్ లను ఎక్కించుకోవడం చేస్తు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 4 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఈ దాడులు నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.