ఢిల్లీకి వందసార్లు పోయిన వంద పైసలు కూడా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం తేలేకపోయిందని సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తనపై ఎవరూ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వారిని జైళ్లల్లో పెడుతున్నారని ఆగ్రహించారు. కొండగల్ రైతులు జైలులోనే మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారినీ వదిలిపెట్టడం లేదని ధ్వజమెత్తారు.