
కార్వాన్: అభివృద్ది పనులపై అధికారులు శ్రద్ధ వహించాలి
అభివృద్ది పనులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఎమ్మెల్యే కలిశారు. వారితో సమావేశమై పలు విషయాలు చర్చించారు. నియోజకవర్గం అభివృద్ది పనులను త్వరగా పూర్తీ చేయాలని, సమస్యల పరిష్కారానికి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సఫియుద్దీన్ పాల్గొన్నారు.