శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి: సీపీ

72చూసినవారు
విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్య మిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఆయన సిబ్బందితో కలిసి పర్యటించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ప్రజలతో మమేకమై పని చేయాలని సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులో పెట్టాలని ఆదేశించారు. పలు వీధుల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్