విజయ సంకల్ప రథయాత్రను విజయవంతం చేయాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ తలపెట్టిన విజయ సంకల్ప రథయాత్ర ఎల్బీనగర్ నియోజకవర్గంలో 23వ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకు బిఎన్ రెడ్డి నగర్ లో చౌరస్తాలో ప్రారంభమై రాత్రి 10 గంటలకు నాగోల్ చౌరస్తాలు ముగుస్తుందని బుధవారం ఎల్బీనగర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేశారు.