గ్రామ సభలలోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని అప్పుడే నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి డిమాండ్ చేశారు. బుధవారం ఆమనగల్లు మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహించి తమకు అనుకూలంగా ఉన్నవారి పేర్లతో తయారుచేసిన లిస్ట్ లను చదివించడం తిరిగి దరఖాస్తులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.