అడ్వకేట్ రక్షణ చట్టం అమలు చేయాలని ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు యాదిలాల్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో న్యాయవాది మహమ్మద్ ముస్తాబా అలీపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం ఆమనగల్లు లో న్యాయవాదులు కోర్టు విదులను బహిష్కరించి తమ నిరసన తెలిపారు. న్యాయవాది పై దాడి చేసిన నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.