డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా రుణాలు పొంది చెల్లించని రైతులు ఏకకాల రుణ పరిష్కార పథకంను సద్వినియోగం చేసుకోవాలని ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, డీసీసీబీ మేనేజర్ గోపాల్ కోరారు. శుక్రవారం ఆమనగల్లులో మాట్లాడుతూ రైతులు రుణాలపై వడ్డీ భారం తగ్గించాలని కోరడంతో డీసీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.