మహేశ్వరం మండలం తుక్కుగూడ గెజిటెడ్ హెచ్ఎం రాములుపై ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ చెందిన నాయకులు అయ్యప్ప భక్తుల ముసుగులో దాడి చేయడం హేయమైన చర్య అని, భక్తి మార్గాన వెళుతున్న అయ్యప్ప భక్తులు బీజేపీ కుట్రలో భాగస్వాములు కావద్దని, అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. దాడి చేసిన నాయకుల పై చట్టపరమైన చర్యలు చేపట్టి వారిని జైలుకు పంపాలని ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.