పిరమిడ్ మాస్టర్లంతా ధ్యాని, శాకాహారి, అహింసావాదులే నని ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ కూతురు పరిణితి పత్రీజీ చెప్పారు. కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం గురువారం 6వ రోజు ఆమె ధ్యానులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నింటికంటే ఉత్తమ ధర్మం అహింస ధర్మం అని తెలిపారు. సంసారంలో జ్ఞానోదయం పొందుతామని, ధ్యానంతో అహింసను పొందుతామని పేర్కొన్నారు.