కడ్తాల్: పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

74చూసినవారు
కడ్తాల్: పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం
కడ్తాల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐగా పదోన్నతి పొందిన నిరంజన్ ను శుక్రవారం ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ దశరథ నాయక్ సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందిన ఆయన పదోన్నతి పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ తులసి రామ్ నాయక్, నాయకులు నరసింహ, శ్రీను, లక్ష్మణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్