ప్రకృతిని విస్మరిస్తే జీవకోటి మనగడ ప్రశ్నార్థకంగా మారుతుందని సహజసిద్ధమైన వనరులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్ లక్ష్మారెడ్డి చెప్పారు. కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి ఎర్త్ సెంటర్ లో షాబాద్ పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కలిగి ఉండాలన్నారు.