కడ్తాల్: మైసిగండి ఆలయానికి 11.40 లక్షల ఆదాయం

83చూసినవారు
కడ్తాల్: మైసిగండి ఆలయానికి 11.40 లక్షల ఆదాయం
కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయంలో శుక్రవారం వివిధ రకాల టెండర్లకు నిర్వహించిన వేలం పాటలో ఆలయానికి11 లక్షల40 వేల 200 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో స్నేహలత చెప్పారు. ఆలయంలో కొబ్బరి చిప్పలు, ఒడి బియ్యం, చీరలు సేకరణకు నిర్వహించిన వేలంపాటలో నలుగురు పాల్గొనగా అత్యధిక వేలం పాడి మైసిగండి కి చెందిన కేతావత్ పరం సింగ్ 11,40,200 రూపాయలకు వేలం దక్కించుకున్నట్లు ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్