సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన సమర్థ నాయకుడు మన్మోహన్ సింగ్ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల్, తలకొండపల్లి మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. కడ్తాల్ లో నివాళులర్పించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు.