మానవాళి ఉన్నంతవరకు ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ సంకల్పం సజీవంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. కడ్తాల్ మండలం అనుమాస్పల్లి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగంలో ఏడవ రోజు శుక్రవారం ఆయన పాల్గొని ధ్యానం చేశారు. అనంతరం ధ్యానులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పత్రీజీ ప్రపంచానికి ధ్యానం అనే గొప్ప సందేశం ఇచ్చారని తెలిపారు.