కడ్తాల్ విజయ పాలశీతలీకరణ కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన కేంద్రాన్ని సందర్శించి నెలకొన్న సమస్యలను, ఇబ్బందులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.