విజయ డైరీ రైతుల పెండింగ్ పాల బిల్లులు చెల్లించి ఆదుకోవాలని గురువారం రాష్ట్ర డైరీ చైర్మన్ గుప్తా అమిత్ రెడ్డికి నాయకులు, రైతులు విజ్ఞప్తి చేశారు. గురువారం కడ్తాల్ లో ఆయనను కలిసి వారు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి పాలశీతలికరణ కేంద్రం పరిధిలో పాల బిల్లులు రావడంలేదని చెప్పారు. పెండింగ్ పాల బిల్లులు చెల్లించి సబ్సిడీ దాన అందించాలని కోరారు.