కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం చెకుముకి పోటీ పరీక్షలు ఎంఆర్ సి భవనంలో నిర్వహించారు. పరీక్షలో పాల్గొన్న బాలుర ఉన్నత పాఠశాల, బట్టర్ ఫ్లై పాఠశాల, మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల టీం జిల్లా స్థాయి పోటీ పరీక్షలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జంగయ్య, జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు విజయకుమార్, టిఎస్ యుటిఎఫ్ నాయకులు శంకర్ నాయక్, పిడి లు భీముడు, మల్లయ్య పాల్గొన్నారు.