తలకొండపల్లి మండలం రాంపూర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారి తిరు కల్యాణోత్సవంను కన్నుల పండుగగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.