రాష్ట్రంలో ఆరెకటికలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి స్పందించాలని ఎమ్మెల్సీ కవితకు రాష్ట్ర ఆరెకటిక సంఘం ఉపాధ్యక్షులు కళ్యాణ్ కర్ జహంగీర్ జీ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆమెను సంఘం నాయకులతో కలిసి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల జనాభా ఉండి మండీ ల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా తమకు కనీస వసతులు కల్పించడం లేదని ఆయన పేర్కొన్నారు.