తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేసి నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి నాయకులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయనను కలిసిన వారు గ్రామంలో ఆసుపత్రి, మండల కేంద్రం ఏర్పాటుతో పరిసరాల 10 గ్రామాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని వారు ఎంపీకి వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.