గ్రామాలలో వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శనివారం ఆయన తలకొండపల్లి మండలం కర్కాస్ తండా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా తాండా సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు.