రంగారెడ్డి: సర్వేలో ఎలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

84చూసినవారు
రంగారెడ్డి: సర్వేలో ఎలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతీమా సింగ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి. సౌమ్య లతో కలిసి మున్సిపల్ కమీషనర్లు, మండల ప్రత్యేకధికారులు, మండల అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్