పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటా: తలసాని శ్రీనివాస్ యాదవ్
ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయం వద్ద సనత్నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగింది.